- Advertisement -
శరీర రంగును చూసి ప్రజలను అవమానిస్తారా అని ప్రశ్నించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మోడీ..పిట్రోడా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
చాలామంది ప్రజల శరీరం రంగు నలుపుగా ఉంటుందన్నారు. శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపేనని గుర్తుంచుకోవాలన్నారు. శరీరం రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పిట్రోడా.. దేశంలోని తూర్పు ప్రాంత ప్రజలు చైనీయుల్లా కనిపిస్తారు. పశ్చిమాన ఉండే వారు అరబ్ జాతీయుల్లా ఉంటారు. ఉత్తరాది వారు తెల్ల జాతీయులలా కనిపిస్తే దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు అని చెప్పగా ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:‘థగ్ లైఫ్’లోకి శింబు
- Advertisement -