ప్రజాసేవే అతిపెద్ద పరీక్ష:మోదీ

1
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరాయంగా 12 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఆయన స్పందిస్తూ సుపరిపాలనకు ప్రజాసేవే అతిపెద్ద పరీక్ష అని అభివర్ణించారు. ఈ 12 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం దేశ ప్రజల నమ్మకం, సంక్షేమం మరియు దేశ ప్రగతికి అంకితం చేయబడిందని ప్రధాని పేర్కొన్నారు.

దాదాపు 140 కోట్ల మంది పౌరుల ఆశీస్సులు , దేశమే ఫస్ట్ అనే భావనతో తమ ప్రభుత్వం యువత, మహిళలు, రైతులు మరియు వెనుకబడిన వర్గాల సాధికారత కోసం నిరంతరం కృషి చేసిందని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన నుండి డిజిటల్ విప్లవం వరకు దేశం సాధించిన పురోగతి కారణంగానే నేడు అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ఒక సరికొత్త గుర్తింపు లభించిందని మోదీ స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ 12 ఏళ్ల నిరంతరాయ సేవలను పూర్తి చేసుకుని దేశంలో అత్యధిక కాలం పనిచేసిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా నిలవడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి జేపీ నడ్డా బిర్లా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాలలో మునుపెన్నడూ లేని విధంగా పురోగమించిందని, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ మంత్రంతో అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికి అందుతున్నాయని కొనియాడారు.

Also Read:GIC:సుందర్‌బ‌న్‌లో హరిత వికాసం

- Advertisement -