గుజరాత్‌లో AI డేటా సెంటర్

2
- Advertisement -

భారతీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), ప్రముఖ అంతర్జాతీయ సోషల్ మీడియా మరియు టెక్నాలజీ సంస్థ ‘మెటా ప్లాట్‌ఫార్మ్స్’ ల మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 168 మెగావాట్ల (MW) సామర్థ్యంతో కూడిన అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్‌ను నిర్మించేందుకు ఇరు సంస్థలు భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.

గ్లోబల్ టెక్నాలజీ లీడర్ అయిన మెటా సంస్థ కోసం భారతదేశంలో ప్రత్యేకంగా రూపొందించబడుతున్న మొట్టమొదటి డేటా సెంటర్ ఇదే కావడం విశేషం. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే రెండేళ్లలో రిలయన్స్ ఈ డేటా సెంటర్‌ను నిర్మించనుంది. భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని మరింత పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఈ ప్లాంట్ నుండి మెటా సంస్థ స్పేస్‌ను లీజుకు తీసుకోనుంది.

Also Read:GIC:సుందర్‌బ‌న్‌లో హరిత వికాసం

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి మెటా ఉత్పత్తుల వెనుక ఉన్న AI సాంకేతికతను మరియు గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడానికి ఈ కేంద్రాన్ని ఉపయోగించనున్నారు. మెటాతో కుదిరిన ఈ భాగస్వామ్యం భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో ఒక విప్లవాత్మక మార్పు…. మెటా వంటి ప్రపంచ స్థాయి సంస్థ కోసం భారత్‌లో ఇలాంటి కేంద్రాన్ని నిర్మించడం, గ్లోబల్ AI విప్లవంలో అగ్రగామిగా నిలిచేందుకు భారతదేశం సిద్ధంగా ఉందనడానికి నిదర్శనం అన్నారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ .

- Advertisement -