అదానీ వ్యవహారంలో మోదీ స్పందించాలని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పద్దుల చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ బీజేపీపై పలు ఆస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…ఛోటే భాయ్ సుభానల్లా…బడే భాయ్ మాషా అల్లా అని మోదీ రాహుల్‌లపై సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. ఈ సందర్బంగా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానం ఇస్తూ తనదైన శైలిలో సీఎం కేసీఆర్ కేంద్రంలోని మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రముఖ ఆర్థికవేత్త జర్నలిస్ట్ పూజా మెహ్ర రాసిన ది లాస్ట్ డికేడ్ అనే పుస్తకంలో దేశార్థికాభివృద్ధిపై మోదీ మన్మోహన్ సింగ్ చేసిన సేవలను వివరించారు.
మోదీ ప్లేస్‌లో మన్మోహన్ సింగ్ ఉన్నా.. భారతదేశ ప్రభుత్వం.. తెలంగాణ లెక్క పని చేసినా జీఎస్‌డీపీ 16లక్షల కోట్లు ఉండేది. ఇది భవిష్యత్ తరాలకు తెలియాలని చెబుతున్నా. మన్మోహన్ హయాం, మోదీ హయానికి పోల్చుకుంటే ప్రతిరంగంలో దేశం నష్టపోయింది. తమాషా ఏంటంటే.. దాంట్లో కూడా దివాళా తీసుకుంటూ మేమే గొప్పొళ్లమని చెప్పుకుంటున్నరు. మొన్న రెండు రోజులు పార్లమెంట్‌లో ప్రధాని మోదీ స్పీచ్‌లో అదానీ సంగతి చెప్పలేదని మండిపడ్డారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ ఎంపీలు కూడా డిమాండ్ చేస్తున్నారు.
హిండెన్‌బర్గ్ ఏం స్టడీ చేసిందో ఏం చేసిందో తెలీదు కానీ ఒక రోజులో 10లక్షల కోట్లు ఆస్తులు కరిగిపోయినాయి అని అన్నారు. తెలంగాణలో అదానీ పెట్టుబడులు పెడతా అంటే జాగా లేదని వద్దన్నాము అని అన్నారు. అదానీ కంపెనీల్లో భారతీయ బ్యాంకులు, ఎల్‌ఐసీ పెట్టబడులు పెట్టాయి. ఎల్‌ఐసీలో 25కోట్ల డిపాజిటర్లు ఉన్నారు. ఇందులో ప్రజలను బీమా కట్టారు. పాలసీదారులందరూ ఆందోళనకు గురవుతున్నారు. ప్రధాని నోటి నుంచి ఒక్కమాట కూడా రాలేదు. కానీ, మా దోస్తు భాగోతం బయటపడిందనే ఆక్రోశం ప్రధానిలో కనిపించింది. దశాబ్ధాల క్రితం నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లను ఇప్పుడు మాట్లాడటం శోచనీయమన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ చనిపోయిన వాళ్లను ఇప్పుడు ఎందుకు చర్చకు తీసుకువచ్చారు అని ప్రశ్నించారు.
దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే.. తెలంగాణకు ఒక్కటీ రాదు. దీన్ని ఏమనుకోవాలి ? ప్రజాస్వామ్యమా? ఫెడరలిజం అంటారా? కోపరేటివ్ అంటే ఇదే అనుకోవాలా? మళ్లీ 157 నర్సింగ్ కాలేజీలు మంజూరు చేస్తామని చెబితే.. ఇందులో ఒక్కటీ రాష్ట్రానికి రాదా? ఇది దేనికి సంకేతం? తెలంగాణనే కాదు ఎవరిపట్ల జరిగినా సరికాదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. రూ.495కోట్లు తెలంగాణకు రావాల్సింది ఏపీ ఖాతాలో వేయించాలంటే కేంద్రాన్ని అడగవట్టి ఏడేళ్లు అవుతుంది. ఏడు సంవత్సరాల నుంచి అడిగి అడిగి అరిగిపోయిన రికార్డులా మారిందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి స్పూర్తి మంచిది కాదన్నారు. దీన్ని ఎవరూ మెచ్చుకోరు అని అన్నారు.
ఇవి కూడా చదవండి…