మోడీ యాక్టింగ్ స్కూల్…నవ్వుఆపుకోలేరు!

274
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల వేళ బీజేపీ చేసిన చిత్రవిచిత్రాలు అన్ని ఇన్ని కావు. గెలుపు కోసం బీజేపీ తొక్కని అడ్డదారులు లేవు. ఎమ్మెల్యేల కొనుగోలు దగ్గరి నుండి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్‌ వరకు అన్ని అస్త్రాలను వాడింది. ఇక ముఖ్యంగా పోలింగ్ రోజు కాంగ్రెస్ అభ్యర్థి…టీఆర్ఎస్‌కు అమ్ముడు పోయారని..సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారనే విష ప్రచారానికి సైతం తెరలేపారు.

ఇక పోలింగ్ కేంద్రాల వద్ద బీజేపీ నేతలు చేసిన హడావిడి అంతాఇంతకాదు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఓ బీజేపీ నేత పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లడం పోలీసులతో కాసేపు మాట్లాడతారు. తర్వాత అతడిని పోలీసులు కొట్టలేదు, ఏమనకుండానే ఏదో జరిగినట్టుగా పరుగెత్తి కింద పడుకొని ఏడుస్తూ చేసిన యాక్టింగ్ అంతా ఇంతకాదు. తనను పోలీసులు కొట్టినట్లు చెప్పడం పక్కన ఉన్న మరికొంతమంది బీజేపీ నేతలు ఓట్లకోసం ఇంతదిగజారాలా అంటూ ఏమోషన్‌ను క్రియేట్ చేసి లబ్ది పొందే ప్రయత్నం చేశారు.

అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఆ బీజేపీ నేత చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఎందుకంటే పూర్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తూర్పారపడుతున్నారు. మోడి యాక్టింగ్ స్కూల్..అదుర్స్‌ అంటూ కౌంటర్‌ ఇస్తున్నారు. ఈ వీడియో మీరు కూడా చూసేయండి..

ఇవి కూడా చదవండి..

- Advertisement -