మొబైల్ లో యాడ్స్ వస్తున్నాయా?

9
- Advertisement -

మొబైల్ యూస్ చేసే టైమ్ లో తరచూ యాడ్స్ డిస్ ప్లే అవుతూ ఇబ్బంది పెడుతుంటాయి. కొన్నిసార్లు మొబైల్ ఆన్ చేయగానే యాడ్స్ రావడం, లేదా ఏదైనా బ్రౌజ్ చేసేటప్పుడు, లేదా గేమ్స్ ఆడేటప్పుడు, మూవీస్ చూసే టప్పుడు సడన్ గా పప్ అప్ యాడ్స్ డిస్ ప్లే అవుతుంటాయి. ఈ యాడ్స్ ఎంతలా ఇబ్బంది పెడతాయంటే ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా యాడ్స్ డిస్ ప్లే అవుతుంటాయి, ఇలా ప్రతి నిముషానికి ఒకసారి గాని లేదా ప్రతి ఐదు నిముషాలకు ఒకసారి గాని యాడ్స్ ప్లే అవుతున్నాయంటే మొబైల్ డేంజర్ లో ఉందని అర్థం చేసుకోవాలి. మొబైల్ లో వైరస్ చేరినప్పుడు ఇలా పప్ అప్ యాడ్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు పోన్ రీసెట్ చేయక తప్పదు. ఇది మాత్రమే కాకుండా ఇతర కారణాల ద్వారా కూడా యాడ్స్ అధికంగా వస్తుంటాయి. కొన్ని మొబైల్ లో సదరు కంపెనీ ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్ బిల్ట్ గా యాడ్స్ ఎనేబుల్ అయి ఉంటుంది. అందువల్ల కూడా పప్ అప్ యాడ్స్ ఎక్కువగా ప్లే అవుతుంటాయి. వీటిని ఆఫ్ చేసుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం !

* ముందుగా మొబైల్ లోని సెట్టింగ్స్ ఓపెన్ చేసి పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ లోకి వెళ్ళాలి. అందులో ప్రైవసీ ఆప్షన్ ఎంచుకోవాలి. కాస్త కిందకు స్కోల్ చేయగా యాడ్ సర్వీస్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పర్సనల్ యాడ్ రికమెండేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. అది ఇన్ బిల్ట్ గా ఆన్ లో ఉంటుంది, దానిని ఆఫ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల యాడ్స్ సమస్య చాలావరకు తగ్గుతుంది. ( ఈ ఆప్షన్ ఒక్కో మొబైల్ లో ఒక్కో విధంగా ఉంటుంది )

* ఇంకా మరోవిధంగా కూడా యాడ్స్ ను తగ్గించవచ్చు. అందుకోసం సెట్టింగ్స్ ఓపెన్ చేసి గూగుల్ సర్వీసెస్ ఎంచుకోవాలి. అందులో మేనేజ్ గూగుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో డేటా ప్రైవసీ ఆప్షన్ లోకి వెళ్ళి మై యాడ్ సెంటర్ ( my ad centre ) ఆప్షన్ లోకి వెళ్ళి పర్సనల్ యాడ్స్ ను ఆఫ్ చేసుకోవాలి

పైన చెప్పిన రెండు విధానాలను చేయడం వల్లడం వల్ల మొబైల్ లో పాప్ అప్ యాడ్స్ బెడద ఉండదు.

Also Read:ది గోట్ లైఫ్…లిరికల్ సాంగ్

- Advertisement -