మతిభ్రమించి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనపై అసత్యపు ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ఓబీసీ నేత ఎదగడాన్ని ఓర్చుకోలేని కోమటిరెడ్డి తనపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన రాజు అన్ని అనుమతులు తీసుకునే నా గ్రామం లో ఇల్లు కట్టుకున్నానని చెప్పారు.
తనపై కబ్జా ఆరోపణలు చేసిన కోమటి రెడ్డి వాటిని నిరూపించాలన్నారు. లేదంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోమటి రెడ్డి వ్యాఖ్యలు నిజమని నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
కోమటి రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని.. .లేదంటే పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం లోకి కేటీఆర్‌ని లాగడం కోమటిరెడ్డికి మంచిదికాదన్నారు. కేటీఆర్ నిప్పు రవ్వ అని తెలిపారు.
21 సంవత్సరాల వయసులో తెలంగాణ ఉద్యమం లోకి వచ్చానని తెలిపిన శంభీపూర్ డబ్బుల సంపాదన పరమావధి అయితే తాను అపుడే అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లోకి వెళ్లే వాడినని తెలిపారు. తాను ఎక్కడైనా ప్రభుత్వ భూమి గజమైనా ఆక్రమించు కున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్దమే
…ఆత్మ గౌరవం తో బతికాను ..దాని కోసం ప్రాణ త్యాగానికైనా సిద్దమేనన్నారు.
తెలంగాణ ఉద్యమం లో కోమటి రెడ్డి లాంటి గుండాలతో పోరాడాను ..ఇపుడు కూడా పోరాడతాను
…కోమటి రెడ్డి కే భారీ ఇల్లు కట్టుకునే హక్కు ఉందా …నా లాంటి బలహీన వర్గాల వ్యక్తి 120 గజాల్లో రెండు గదులు కట్టుకోకూడదా అని ప్రశ్నించారు.