బీజేపీపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్‌..

193
mlc palla rajeshwar reddy
- Advertisement -

కృష్ణ, గోదావరిలో మన వాటా లెక్క కట్టి.. ప్రణాళికలు వేసి.. అత్యంత వేగంగా ప్రాజెక్టులు కడుతున్నారు కేసీఆర్ అని ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఇవ్వాళ అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో జరిగిన సమావేశాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 2,28,000 రూపాయల తలసరి ఆదాయంతో దేశ సగటు కంటే ముందున్నాం అన్నారు. మన ఇంటి ఆడబిడ్డ ప్రసూతి అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి, కేసీఆర్ కిట్ ఇచ్చి, 12-13 వేల రూపాయలు ఇస్తున్నాం.. ఎక్క కూడా ఇటువంటి సంక్షేమం లేదని ఎమ్మెల్సీ తెలిపారు. లక్ష ముప్పై వేల మందిని రిక్రూట్ చేసుకున్నాం. ఒకవేళ అనుమానం ఉంటే మేం చెప్పిన డిపార్ట్మెంట్ల ఫిలప్ అయినయ లేదా చూస్కోమంటున్నం అని అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్క శాతం ఉంటయి… నాలుగు కోట్ల జనాభాకి నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటాయి. 1.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్కున్నం…ఇంకో 50-60 వేల ఖాళీలు ఉన్నయి…అవి కూడా చేసుకుంటాం అని అన్నారు. అద్భుతమైన టీఎస్ఐపాస్ తెచ్చి కొత్త ఉద్యోగాలు ఇచ్చినం… ప్రయివేట్ కంపెనీలు పెట్టడానికి ఈ ప్రభుత్వం ఉపయోగపడ్డది…14 లక్షల ఉద్యోగాల కల్పనకు తోడ్పడ్డది. వేరే ఏ రాష్ట్రమైన 2014 తర్వాత ఇదే నిష్పత్తిలో ప్రభుత్వంలో కానీ, ఐటీలో కానీ, ప్రయివేటులో కానీ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిందా అని మేము అడుగతున్నాం. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తమన్నది బీజేపీ ప్రభుత్వం. మీ ఊళ్ళో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రెండు ఉద్యోగాలు అయిన ఒచ్చినయ అని ఎమ్మెల్సీ విమర్శించారు.

23 అతి పెద్ద కంపెనీలను మోడీ ప్రభుత్వం మూసేసింది. ఉద్యోగాలు ఇయ్యలే, ధరలు అన్ని పెంచిర్రు.. ఉద్యోగ కల్పన చేసిన కేసీఆర్‌ను తిట్టడానికి మీకు మనసెట్ల ఒస్తదని దుయ్యబట్టారు. 2018 తర్వాత రెండేళ్లు ప్రభుత్వం నడిపినం.. అందులో ఒక సంవత్సరం మొత్తం ఎలెక్షన్లు, ఇంకో సంవత్సరం కరోనా వల్ల ఇబ్బంది ఒచ్చింది. 25 వేల కోట్లు పెరుగతది అనుకున్న బడ్జెట్ 50 వేల కోట్ల తగ్గింది. ఏ పార్టీ అయితే ఈరోజు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుందో తెలంగాణ తేవడంలో వాళ్ళ పాత్ర లేదు, ఖమ్మం జిల్లాకు అన్యాయం చేయడంలో మాత్రం వాళ్ళ పాత్ర ఉందని పల్లా మండిపడ్డారు.

అనేక ఎన్నికలు గెలిచినం..100% విజయాలు సాధించినం. ఒక్క ఎన్నిక 500 ఓట్లతో ఓడిపోగానే ఇష్టమొచ్చినట్లు మాట్లాడ్తున్నరు. ఈ ఎన్నికను మీ ఎన్నికగా తీసుకోవాలి. వాళ్లందరికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా టీఆరెస్ పార్టీ అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోరుకుంటున్న అని అన్నారు. మీరిచ్చిన అవకాశంతో వ్యక్తుల సమస్యలు ఒచ్చిన, సంఘ సమస్యలు ఒచ్చిన, ఉద్యోగుల సమస్యలు ఒచ్చిన కౌన్సిల్ వేదికగా వాటన్నిటినీ మాట్లాడిన అని తెలిపారు. ప్రశ్నను ప్రశ్నలా ఉంచకుండా పరిష్కార కేంద్ర దగ్గరికి తీసుకుపోయిన… ప్రశ్నించే గొంతుగా మిగలకుండా పరిష్కారం చూపే గొంతుగా రిప్రసెంట్ చేస్తా అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -