అధికారులు పల్లెలకు తరలండి: మంత్రి తలసాని

177
talasani
- Advertisement -

2014 తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో దేశంలోనే అగ్రస్థానం సంపాదించాం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని పశుసంక్షేమ భవన్ లో పశుసంవర్ధక శాఖ అధికారుల నూతన సంవత్సర డైరీ,క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని..గతంలో ఏ ప్రభుత్వం కూడా మన డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టలేదన్నారు.

మూగ జీవాలకు చెసే సేవ భగవంతునికి చేసే సేవ లాంటింది…ఇతర రంగాలతో పోలిస్తే పశుసంవర్ధక శాఖ అగ్రగామిగా నిలిచిందన్నారు. మన వేకెన్సీ లు అన్నీ భర్తీ చేసుకున్నాం..ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు పల్లెలో పర్యటించాలి…ముఖ్యమంత్రి కేసీఆర్ పాజిటివ్ దృక్పథం తో ఆలోచిస్తారని చెప్పారు.

గొర్రెల పంపిణీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది..గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ,సంపద స్పృష్టించాలంటే మన డిపార్ట్మెంట్ కీలకం అన్నారు. ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించేందుకు అధికారులు ముందుకు వెళ్ళాలి..అవసరమైతే మాంసాన్ని ప్రభుత్వ బ్రాండ్ తో అమ్మే విదంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలి స్టడీ చేయాలన్నారు.

గతంలో విజయ డైరీని మార్కెటింగ్ చేయలేదు..ఇప్పుడు ప్రయివేట్ కి దీటుగా ముందుకి వెళుతున్నాం అన్నారు. మీకు అన్ని విధాలుగా సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది…ప్రభుత్వానికి పేరు వచ్చేలా అధికారులు పని చేయాలన్నారు. అధికారులు ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లడం అనే పద్దతిలో కాకుండా డిపార్ట్మెంట్ కి పేరు వచ్చేలా పని చేయాలి….మీకున్న ఏ సమస్యలున్నా పరిష్కరించబడతాయన్నారు. వారానికి రెండు రోజులు ఫీల్డ్ మీద ఉండాలి రైతులకు అండగా నిలబడాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో బర్ద్ ఫ్లూ రాగానే మనం అప్రమత్తమై మన దగ్గర రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం సక్సెస్ అయ్యాం అన్నారు.

- Advertisement -