టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని నారాయణగూడకు చెందిన హైకోర్టు న్యాయవాది అక్కి వర్ష(41)ను 23వ తేదీన నాంపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మ్యారేజ్ చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబసభ్యులు..జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి జరిగింది.
61 ఏళ్ల వయసున్న ఆయన మొదట్నుంచి ఆదర్శ… అభ్యుదయ భావాలతో మెలిగారు. బాల్యం నుంచి విప్లవోద్యమాల బాట పట్టాడు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావుతో కలిసి నక్సలైట్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ స్ఫూర్తిలోనే పెళ్లి చేసుకోకుండా అవివాహితుడిగానే ఉండిపోయారు. అనంతరం కాలంలో ఉద్యమ బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.
2001లో టీఆర్ఎస్‌లో చేరిన ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్రపోషించారు.రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.