- Advertisement -
మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా రాష్ర్ట ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. శివలింగానికి దండం పెట్టిన ఫోటోను షేర్ చేశారు.
ఇక శివనామస్మరణతో ఆలయాలు మార్మోగిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక పూజలు చేసి, శివలింగాలకు అభిషేకం చేశారు భక్తులు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
- Advertisement -