ఏ కొండెక్కిన, ఏ బండకు మొక్కినా అది రాష్ట్రం కోసమే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామికి కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడున్న కోతులకు అరటి పండ్లను అందించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా గెలిపించిన కామారెడ్డి, నిజామాబాద్ ప్రజాప్రతినిధులకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కవిత ధన్యవాదాలు తెలిపారు.
కొండగట్టు అంజన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని కవిత స్పష్టం చేశారు. దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది అని గుర్తు చేశారు. కరోనా సమయంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించాం. కొండగట్టులో చక్కటి అద్బుత నిర్మాణాలు జరుగుతున్నాయి అని పేర్కొన్నారు. రామకోటి స్థూప నిర్మాణ పనులను పరిశీలించారు.