పునీత్ మ‌ర‌ణంపై జక్కన్న ఏమన్నారంటే..

29

టాలీవుడ్ దర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోష‌న్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బెంగళూరులోని ఓరియన్ మాల్‌లో జనని కన్నడ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా జక్కన్న పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణంపై స్పందించారు.. త‌నకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నారు. పునీత్‌ రాజ్‌కుమార్ చాలా మందికి సాయం చేసిన‌ప్ప‌టికీ ఎవ్వ‌రికీ చెప్ప‌లేద‌ని, ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాతే ఆయ‌న సేవ‌ల గురించి అంద‌రికీ తెలిసింద‌ని రాజ‌మౌళి అన్నారు.

సాధారణంగా ఎవ‌రైనా చిన్న సాయం చేసినా ప్రపంచానికి తెలిసేలా ప్ర‌చారం చేసుకుంటార‌ని, పునీత్ రాజ్‌కుమార్ మాత్రం అలా కాదని ఆయ‌న అన్నారు. నాలుగు ఏళ్ల క్రితం తాను బెంగళూరుకు వచ్చినప్పుడు పునీత్ రాజ్‌కుమార్‌ను కలిశానని. త‌న‌ను కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారని చెప్పారు. త‌న‌తో ఆయ‌న‌ సరదాగా మాట్లాడారని, ఒక స్టార్‌తో మాట్లాడుతున్నాననే భావనే త‌నకు కలగలేదని రాజ‌మౌళి అన్నారు. మ‌న మ‌ధ్య ఆయ‌న లేర‌నే విష‌యాన్ని ఇప్ప‌టికీ న‌మ్మ‌లేక‌పోతున్నాను అన్నారు.