- Advertisement -
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టూ విలర్ నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బుధవారం నానక్‌రాంగూడ చౌరస్తాలో ఓ మహిళ తాను హెల్మెట్ ధరించడమే కాకుండా స్కూల్‌కు తీసుకెళ్తున్న నాలుగేళ్ల కూతురికి కూడా హెల్మెట్ ఏర్పాటు చేసి స్కూటీ నడిపిస్తోంది. ఈ దృశ్యాన్ని కారులో వెళ్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
తల్లి తానే కాకుండా తన కూతురికి కూడా హెల్మెట్ ధరించి స్కూటీ నడిపిస్తూ తనకు స్ఫూర్తిగా నిలిచిందంటూ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు హె ల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాంటూ తెలిపింది.
- Advertisement -