- Advertisement -
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించిన సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి.. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత. ఎన్నికలో గెలుపొందిన కల్వకుంట్ల కవితకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కవిత కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కేసీఆర్ ఆశీర్వదించారు.
ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 824 ఓట్లకు గాను, 823 ఓట్లు పోలవ్వగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, 728 ఓట్లు సాధించి చరిత్ర సృష్టించారు. పోతాంకర్ లక్ష్మీనారాయణ (బీజేపీ)- 56, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి( కాంగ్రెస్)-29 ఓట్లు సాధించి, డిపాజిట్ కోల్పోయారు.
- Advertisement -