బ్రహ్మణ సామాజిక వర్గానికి ధన్వంత్రి ఫౌండేషన్ సేవలు అభినందనీయం అన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ అంబర్ పేటలోని ధన్వంత్రి ఫౌండేషన్ అసోసియేషన్ మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్సీలు కవిత, నారదాసు లక్ష్మణ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ,రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్, రాష్ట్ర బేవరేజస్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ దేవీ ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత… 2001 లో ఒక్కడిగా ఉద్యమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు.. బ్రహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. పేద బ్రాహ్మనుల కొరకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటుచేసి ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణుల గురించి, వారి అభ్యున్నతి కొరకు పాటుపడుతున్నామన్నారు.
హైదరాబాద్ లో ఐదు ఎకరాల్లో బ్రహ్మణుల కోసం ప్రత్యేక భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది….ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పోరాటం కొనసాగించాం కాబట్టే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ డెవలెప్ మెంట్ కు ఉపయోగ పడే అన్ని సంఘాలకు టీఆర్ఎస్ మద్దతు ఉంటుంది… మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి కూతురు, మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవి గారికి మద్దతివ్వండన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు పివి శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది…బీజేపీ ఎమ్మెల్సిగా రాంచంద్ర రావు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి తెలంగాణ కోసం ఎప్పుడూ పోరాటం చేయలేదు…మార్చి 14 న అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.