చమురు ధరలు తగ్గించాలి: ఎమ్మెల్సీ కవిత

45
kavitha
- Advertisement -

రాష్ట్ర ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోడీదే అన్నారు ఎమ్మెల్సీ కవిత. పెంచిన పెట్రోల్,డీజీల్,గ్యాస్ ధరలకు నిరసన సికింద్రాబాద్‌లో చేపట్టిన టీఆర్ఎస్ ధర్నాలో పాల్గొని మాట్లాడారు కవిత.

జీడీపీ పెంచమంటే.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచుతున్నదని విమర్శించారు. 2014లో పెట్రోల్‌ ధర రూ.60 ఉండేదని, ఆరోజు క్రూడాయిల్‌ ధర ఇంకా చాలా తక్కువ ఉందని చెప్పారు. ఈ రోజు ముడిచమురు ధర తక్కువ ఉన్నప్పటికీ పెట్రోల్‌ ధరలు పెంచారని విమర్శించారు.

తెలంగాణ ఆడబిడ్డల తరఫున బండి సంజయ్‌ ఢిల్లీ వెళ్లి కొట్లాడాలన్నారు. ఆయిల్‌ సబ్సిడీలు ఎత్తివేసి రూ.23 లక్షల కోట్లు కూడబెట్టుకున్నారని తెలిపారు. డ్వాక్రా మహిళలు, రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదు కానీ.. రూ.11 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలు మాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

- Advertisement -