వెంకట్ ప్రభుతో చైతూ!

60
venkat
- Advertisement -

ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు నాగచైతన్య. ఇప్పటికే పలు సినిమాలను లైన్లో పెట్టిన చైతూ…తాజాగా వెంకట్ ప్రభు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అధికారికంగా వెల్లడించాడు వెంకట్ ప్రభు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనుండగా సూర్య విలన్‌గా కనిపించనున్నట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం నాగ చైతన్య నటించిన థాంక్యూ, బాలీవుడ్ మొదటి సినిమా లాల్ సింగ్ చద్దా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇటీవలే డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన చైతూ ‘దూత’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు పరుశరామ్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ప్రభుతో సినిమా స్టార్ట్ కానుంది.

- Advertisement -