కాశీ అన్న‌పూర్ణ‌కు క‌విత ప్ర‌త్యేక పూజ‌లు

171
kavitha mlc
- Advertisement -

వారణాసిలో కాశీ అన్నపూర్ణకు ఎమ్మెల్సీ క‌విత‌ ప్రత్యేక పూజలు చేశారు. వారణాసిలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు కాశీ అన్నపూర్ణా దేవికి పూజ‌లు చేశారు. ఈ విష‌యాన్ని ఎమ్మెల్సీ క‌విత త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. మ‌హాదేవుడికి, పార్వ‌తీమాత‌కు పూజ‌లు చేయ‌డం సంతోషంగా ఉందని వెల్లడించారు.

తొలిరోజు అస్సీఘాట్‌కు చేరుకొని, అక్కడి నుంచి దశాశ్వమేధ ఘాట్‌ వరకు బోట్‌లో ప్రయాణించారు. అక్కడ గంగానదికి హారతి ఇచ్చారు. స్థానిక ప్రజలతో ముచ్చటించారు. గంగమ్మ సాక్షిగా బెనారస్‌ ప్రజలతో సంభాషించడం ఆనందంగా ఉన్నదని కవిత పేర్కొన్నారు.

- Advertisement -