మోహన్‌బాబు…సన్‌ ఆఫ్‌ ఇండియా ఫస్ట్ లుక్‌

191
mohan babu
- Advertisement -

డైలాగ్ కింగ్ మోహన్‌ బాబు ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సన్‌ ఆఫ్ ఇండియా. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 24ఫ్రేమ్స్ ఫాక్టరీ, శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.

ఈ పోస్టర్ చూసిన మంచు అభిమానులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మోహన్ బాబు మ్యానిరిజానికి తగ్గట్టుగా పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విరూపాక్ష అనే పాత్ర మోహన్ బాబు కనిపించనున్నారు. తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, రఘు బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

- Advertisement -