శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు.

156
kavitha
- Advertisement -

శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత. నవీపేట మండలం జన్నేపల్లి గ్రామంలోని శివాలయాన్ని దర్శించుకున్న కవిత… రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు తెలిపారు. పురాతన శివాలయాన్ని పునరుద్ధరించిన ఎమ్మెల్యే హనుమంత రావును కవిత అభినందించారు.

హైదరాబాద్ నుంచి జన్నేపల్లి బయల్దేరిన ఎమ్మెల్సీ కవితకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. కామారెడ్డిలోనూ అశేష జనవాహిని కదలివచ్చి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్, ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, జీవన్ రెడ్డి, షకీల్ అహ్మద్, గణేశ్‌ గుప్తా, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -