ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి షాక్…

219
france
- Advertisement -

ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి చుక్కెదురైంది. అవినీతి కేసులో ఆ దేశ కోర్టు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. అవినీతికి సంబంధించిన ఈ కేసు ఆరోపణలను సమర్ధించిన ఫ్రెంచ్‌ కోర్టు సోమవారం ఆయనను దోషిగా తేల్చింది.

నికోలస్ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. 2007 ఎన్నికల ప్రచారంలో ఆయన భారీగా ఆర్థిక సహాయం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. 2012లో అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాత ఈ విషయం బయటపడింది.

తన ప్రచార ఆర్థిక విషయాలపై కోర్టులో ఉన్న సమాచారాన్ని అందించేందుకు బదులుగా మొనాకోలో న్యాయమూర్తి గిల్బర్ట్ అజిబర్ట్‌కి పదోన్నతిని కల్పించారన్న ఆరోపణలను సర్కోజీ ఎదుర్కొంటున్నారు. శిక్షపై అపీల్‌ చేసేందుకు ఆయనకు కోర్టు పది రోజులు గడువు ఇచ్చింది.

- Advertisement -