హోం ‌క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

237
kavitha
- Advertisement -

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఐదు రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన ‌జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌‌గా‌ నిర్దారణ కావడంతో, ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఐదు రోజులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో ఉండటం లేదని తెలిపారు.

ఈ రోజు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇటీవల సంజయ్ కుమార్ ఓ వేడుకకు హాజరయ్యారు. ఆ వేడుకలో ఆయనకు కరోనా సోకి ఉండచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలకు ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన సమావేశాలకు హాజరుకాలేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. కాగా ఇటీవల జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత విజయానికి ఎమ్మెల్యే సంజయ్ సైతం తన వంతు కృషి చేశారు.

- Advertisement -