ఉర్సు ఉత్సవాలకు చాదర్ అందించిన ఎమ్మెల్సీ కవిత..

58
MLC Kavitha

నిజామాబాద్‌ జిల్లాలోని వర్ని మండంల కేంద్రంలో గల ప్రసిద్ధ బడా పహాడ్ దర్గాలో హజ్రత్ సయ్యద్ సాదుల్లా హుస్సేనీ షరీఫ్ 700వ ఉర్సు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 23 నుండి 26 వరకు జరగనున్నాయి.ఈ సందర్భంగా బడా పహాడ్ దర్గాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాదర్ అందించారు.

ఈ రోజు దర్గా ప్రతినిధులు, ముస్లిం మతగురువులు ఎమ్మెల్సీ కవితను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వర్ని మండలంలో గల ఈ‌ దర్గాలో జరిగే హజ్రత్ సయ్యద్ సాదుల్లా హుస్సేనీ షరీఫ్ ఉర్సు ఉత్సవాలకు ఈ చాదర్‌ను సమర్పించనున్నారు.