పండుగలా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వలు..

24
Minister Mallareddy

మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేట్ మండలంలోని తుర్కపల్లిలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జరిగింది. ఈరోజు కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు పండుగలా జరుగుతుంది. ఇందులో యువకులు, నాయకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈసందర్భంగా మంత్రి పార్టీ నాయకులకు సభ్యత్వ పుస్తకాలను అందజేశారు.

మంత్రి మాట్లాడుతూ.. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. టిఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకొని,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎల్లు బాయి,ఎంపిటిసిలు, ఉప సర్పంచ్ యూసుఫ్,కో-ఆప్షన్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.