సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో సబితమ్మ..

19

మహేశ్వరం నియోజకవర్గం, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు అధికారికంగా తెలంగాణలో తప్ప దేశంలో ఇంకెక్కడా జరపడం లేదంటే ఇది మన రాష్ట్ర గొప్పతనమ‌న్నారు. సీఎం కేసీఆర్ గిరిజనులు అభివృద్ధికి, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు.

సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తూ సంప్రదాయాలను, ఆచారాలను కాపాడుతున్నారన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేశామ‌ని మంత్రి తెలిపారు. తండాలను గ్రామ పంచాయితీలుగా చేశారు. గిరిజనులకు అత్యధిక గురుకులాలు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ గారిదేన‌న్నారు.