ఆప్యాయంగా పలకరించుకున్న గవర్నర్ – కవిత

111
governor
- Advertisement -

బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ తమిళి సై – ఎమ్మెల్సీ కవిత అనుకోకుండా ఎదురై ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

ఎమ్మెల్సీ కవితతో పాటు యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఈ వేడుకకు హాజరయ్యారు. వీరు బతుకమ్మ పేర్చుతున్న సమయంలో గవర్నర్ తమిళి సై అమ్మవారి దర్శనానికికి అక్కడికి చేరుకున్నారు. ఆలయ ముఖద్వారం వద్ద గవర్నర్, ఎమ్మెల్సీ ఎదురెదురుగా నిల్చొని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -