తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..

414
LPG cylinders price drop of more than Rs 160 per cylinder
- Advertisement -

కమర్షియల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.25.50 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ.1859కి చేరింది.

హైదరాబాద్‌లో రూ.36.50 తగ్గడంతో రూ.2099.5గా ఉన్న సిలిండర్‌ రూ.2064కు చేరగా కోల్‌కతాలో రూ.1959, ముంబైలో 1811.5, చెన్నైలో రూ.2009.5గా ఉంది. జులై నెలలో రూ.135, ఆగస్టులో రూ.36 మేర తగ్గిన ధర సెప్టెంబర్‌ 1న మరో రూ.91.50 మేర తగ్గింది. తాజాగా రూ.25.5 తగ్గుమఖం పట్టింది.

- Advertisement -