MLC Kavitha:అబద్దాలకు కేరాఫ్ అమిత్ షా

47
- Advertisement -

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు కవిత. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె…అబద్దాలకు కేరాఫ్‌గా అమిత్ షా మారారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మాటలను నమ్మి మోసపోవద్దని కోరారు. ప్రజల్లో ఉండి ప్రజల కోసం నిర్విరామంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు మద్ధతివ్వాలని పిలుపునిచ్చారు.

దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, 2.32 వేల ఉద్యోగాలను ప్రకటించామని, 1.6 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ అయ్యాయని గుర్తు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఇతర పార్టీలు వచ్చి రకరకాల మాటలు మాట్లాడుతాయని, కానీ ఎవరు మంచి చేస్తున్నారో ఆలోచించాలని కోరారు.ఎన్నికల తర్వాత రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు

కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప్పు, పప్పు, మంచినూనె, ఉల్లిగడ్డ వంటి అన్ని నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రూ.200 పెన్షన్ ఇస్తే దానిని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 2 వేలు ఇస్తున్నామని చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ప్రధాని తగ్గించలేదని అందుకే సీఎం కేసీఆర్ పేదలపై భారం తగ్గించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. కోరుట్లలో వెయ్యి ప్లాట్లను ఇస్తామని, ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం గృహలక్ష్మి కింద రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పారు.

Also Read:రాజస్థాన్ ఎలక్షన్స్ .. కాంగ్రెస్ భయం!

- Advertisement -