సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. మీడియాతో మాట్లాడిన కవిత…జల శక్తి మంత్రిత్వశాఖ సమావేశంలో బనకచర్లపై చర్చించినట్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టంగా చెప్పింది అన్నారు.
కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బనకచర్లపై చర్చ జరగలేదని అంటున్నారు. తెలంగాణకు నష్టం జరుగుతుంటే ముఖ్యమంత్రికి సీరియస్ నెస్ లేదు అన్నారు. తెలంగాణ హక్కులను చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారు అని మండిపడ్డారు.
బనకచర్ల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి సాధించిన విజయం ఏమీ లేదు అన్నారు. బనకచర్ల వల్ల ఏపీ ప్రజలకు ప్రయోజనం లేదు అని.. నీళ్లు వస్తున్న ఆయకట్టుకు మళ్లీ నీళ్లు ఇచ్చేలా డిజైన్ చేశారు తప్పితే ఇందులో కొత్తదనం లేదు అన్నారు. బనకచర్ల కుట్ర పూరితమైనది, కాంట్రాక్టర్ల కోసం, కమీషన్ల కోసం కడుతున్న ప్రాజెక్టు అని ఆరోపించారు.
Also Read:West Indies:రసెల్ సంచలన నిర్ణయం

