చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్!

8
- Advertisement -

చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగదీశ్‌ రెడ్డి… రేవంత్ రెడ్డి.. నీ కుటుంబం కోసం కోట్లాది మంది ప్రజలను బలి పెడతావా? చెప్పాలన్నారు.

కాళేశ్వరాన్ని ప్రారంభం చేయకుండా చంద్రబాబు చెప్పిన డైరెక్షన్లో వ్యవహరిస్తున్నావు అన్నారు. మాకు కాళేశ్వరం ఉంది దానికి 140 టీఎంసీల నీళ్లు ఎత్తుతున్నామని మనం చెప్తే.. ఇవాళ బనకచర్లకు ఎట్టి పరిస్థితిలో అనుమతి వచ్చే అవకాశం లేదు అన్నారు.

Also Read:West Indies:ర‌సెల్ సంచ‌ల‌న నిర్ణ‌యం

చంద్రబాబు మీడియా నిన్నటి చర్చపై తెలంగాణ ఎడిషన్‌లో ఒకలా, ఆంధ్ర ఎడిషన్‌లో ఒకలా రాసింది అన్నారు. రేవంత్ రెడ్డి నిన్న ఎజెండాలో బనకచర్ల మీద అంశమే లేదు ఎలా మాట్లాడాలి అన్నాడు అన్నారు. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఏమో బనకచర్ల మీద చర్చ జరిగింది, కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నాడు..తెలంగాణ ప్రజలు వీళ్ళు చేసే ద్రోహాన్ని, మోసాన్ని చూడాలి అన్నారు.

- Advertisement -