MLC Kavitha:జీవో 3 రద్దు చేయాల్సిందే

20
- Advertisement -

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయం, go 3 రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు కవిత.

రాజ్యాంగం వచ్చిన తర్వాత మహిళల కోసం అనేక చట్టాలు చేసుకుంటూపోతున్నాం అన్నారు ఎమ్మెల్సీ కవిత. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయని..తెలంగాణ వచ్చాక మహిళల కు 33 శాతం రిజర్వేషన్లు పోలీస్ శాఖ లో కల్పిస్తున్నాం అన్నారు. ప్రతి యూనివర్సిటీ లో మహిళల సంఖ్య పెరిగింది…పోటీ పరీక్షల్లో మహిళలే టాప్ వస్తున్నారు అన్నారు. 33శాతం మహిళ రిజర్వేషన్లు కావాలనే కేసిఆర్ కోరారు…ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.కానీ GO 3 తీసుకొచ్చి ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుందన్నారు.

Go 3వల్ల మహిళల కు కేవలం 12 శాతం మాత్రమే వస్తాయని…ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఒక కోర్టుకు కాకపోతే మరో కోర్టుకు వెళ్లే రేవంత్ రెడ్డి…మహిళల కు అన్యాయం జరిగే ఈ GO పై అవసరం అయితే సుప్రీం కోర్టు కైన వెళ్లాలన్నారు. మహిళా వ్యతిరేక ప్రభుత్వం గా రేవంత్ ప్రభుత్వం మారుతోందని..PGT, JL పోస్టుల్లో కూడా అన్యాయం జరుగుతుందన్నారు. ప్రజలను కలవటం లేదని కేసిఆర్ విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ప్రజలను కలవడం లేదని…ఢిల్లీ నేతలనే ఎందుకు కలుస్తున్నారో చెప్పాలన్నారు.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో అనిల్ కూర్మాచలం

- Advertisement -