ఎల్ రమణను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత..

25

కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎల్ రమణకు గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఎల్ రమణ ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోగా గుండె లోని ఒక వాల్వ్ దెబ్బతిందని వైద్యులు తెలుపగా వారి సూచనల మేరకు ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగింది.