జవాన్ మోతీలాల్ మృతిపట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం..

40
MLC Kavitha

రోడ్డు ప్రమాదంలో స్వర్గస్తులైన జవాన్ మోతీలాల్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. దేశ రక్షణకై సైన్యంలో చేరిన మోతీలాల్, స్వగ్రామంలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరం అన్నారు. అంతేకాదు మోతీలాల్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.

నిజమాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం మేగ్యా నాయక్ తండాకు చెందిన ఆర్మీ జవాన్ దెగవత్ మోతీలాల్ (25) డిసెంబర్ 28న సదాశివనగర్ మండలం దగ్గి వద్ద రోడ్డు ప్రమాదంలో మోతీలాల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని హైదరాబాద్ ఆర్మీ హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు.