ఈ నెల 16 నుండి రెండో విడత గొర్రెల పంపిణీ..

231
kcr
- Advertisement -

గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కనుకగా జనవరి 16వ తేదీ నుండి నల్గొండ జిల్లా కేంద్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్, రాష్ట్ర పురపాలన, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె. తారక రామారావు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య,పాడి పరిశ్రమ అభివృద్ధి,సినిమోటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన నున్నారు.

గొర్రెల పెంపకమే జీవనాధారంగా సాగిస్తున్న గొల్ల, కురుమలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి ని సాధించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఆలోచనల నుండి వచ్చిందే గొర్రెల పంపిణీ కార్యక్రమం. రాష్ట్రంలో 8,109 గొర్రెల పెంపకం దారుల సొసైటీ లు ఉండగా, వీటిలో 7,61,895 మంది సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో గొర్రెలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. రెండు విడతలలో గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించి ఆ మేరకు 2017వ సంవత్సరంలో ప్రారంభించి మొదటి విడతలో 3,66,373 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది.

ఇందు కోసం ప్రభుత్వం 4,579 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెలతో 2017-18 లో 20.75 లక్షలు, 2018-19 లో 39.94 లక్షలు, 2019-20 లో 39.28 లక్షలు, 2020-21 లో 37.12 లక్షల గొర్రెల సంపదను సృష్టించడం జరిగింది. నూతనంగా పుట్టిన ఒక కోటి 37 లక్షల గొర్రె పిల్లల విలువ దాదాపు 6,169 కోట్ల రూపాయలు ఉంటాయి. రాష్ట్రంలో డీడీ లు చెల్లించిన 28,335 మందికి ఈ నెల 16వ తేదీన నల్లగొండ జిల్లా కేంద్రంలో గొర్రెల పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభం కానుంది. ఇందుకోసం 360 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన 4,210 కోట్ల రూపాయలను వచ్చే బడ్జెట్‌లో కేటాయించనుంది ప్రభుత్వం.

- Advertisement -