బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక పూలే: కవిత

20
- Advertisement -

దీక్షకు మద్దతిచ్చిన, తరలివచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడం సంతోషకరం.. తెలంగాణ జాగృతితో పాటు అన్ని నుంచి వచ్చిన యూనివర్సిటీ విద్యార్థులకు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు అన్నారు. పూలే యునైటెడ్‌ ఫ్రంట్‌ నేతలకు, బీసీ సంఘాలు, కులసంఘాల నేతలకు అందరికీ కృతజ్ఞతలు … బీసీలలో ఉన్న అన్ని కులసంఘాలకు ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు అన్నారు.

బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన పూలే విగ్రహం ఏర్పాటుకు.. కృషి చేస్తున్న సంఘాల ప్రతినిధులు ఉన్నారు, ఈ పోరాటాన్ని మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు.. ఏ ఉద్యమానికైన పాట కూడా తోడు ఉండాలి… ఇవాళ ఇంత స్థాయిలో పోరాటం చేయడం వెనుక..అన్ని జాతులు, కులాలకు న్యాయం కోసమే అన్నారు.
బడుగుజాతుల అభ్యున్నతి కోసం ఎంతో కష్టపడ్డ మహనీయుడు జ్యోతిబాపూలే… జ్యోతిబాపూలే పోరాటం అందరికీ స్పూర్తి అన్నారు.

ఇవాళ మనం ఇలా పోరాటం చేస్తన్నమంటే..జ్యోతిబాపూలే వంటి మహనీయులు చేసిన పోరాటాలే స్ఫూర్తి.. అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు కోసం పోరాడినప్పుడు కూడా..
ఎన్నో విమర్శలు, కుట్రలు చేశారు… ఇప్పుడు అలాంటి విమర్శలు, అడ్డంకులు సృష్టిస్తున్నారు అన్నారు. జ్యోతిబాపూలే విగ్రహం ఏర్పాటుతో పాటు రిజర్వేషన్లు కల్పించాలి… విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల కోసం వేర్వేరుగా..బిల్లులు పెట్టాల్సిందేనని పోరాటం చేశాం అన్నారు.

బీజేపీని కాపాడటం కోసమే కాంగ్రెస్‌ పని చేస్తోంది… ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళుతామని చెప్పి తీసుకెళ్లలేదు, ఢిల్లీలో దీక్షలో కూడా కాంగ్రెస్‌ నేతలే పాల్గొన్నారు.. మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పని చేయడం లేదు… కులగణనపై కాంగ్రెస్‌ సర్కార్‌ ఆంక్షలు విధిస్తోంది… కులగణనపై ఎవరూ మాట్లాడవద్దని హెచ్చరిస్తున్నారు అన్నారు.2011 లో కాంగ్రెస్‌ చేసిన కులగణన వివరాలు ఇప్పటికీ ఇవ్వలేదు… ఇప్పుడు కాంగ్రెస్‌ చేసిన కులగణన చేసిన వివరాలు బయటికి చెప్పడం లేదు అన్నారు.

కులగణనపై ఏఐతో క్రమబద్దీకరిస్తామంటున్నారు.. ఏఐ అంటే అనుముల ఇంటిలెజెన్స్‌, కులగణన వివరాలు అసెంబ్లీలో పెట్టండి.. మీ వలే ఢిల్లీలో దొంగ దీక్షలు చేయం… ఢిల్లీలో నిరవధిక దీక్షలు చేయడానికి మేము సిద్ధం అన్నారు.

Also Read:బీజేపీకి రూ.2,243 కోట్ల విరాళాలు..!

- Advertisement -