బండి సంజయ్‌కి కౌంటర్‌ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత..

85
- Advertisement -

మేడారం జాతరపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎంపీ బండి‌ సంజయ్ ను ప్రశ్నించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ తెలంగాణలోనే ఉండటం మనందరికీ గర్వకారణం.స్వరాష్ట్రంలో నాలుగు సార్లు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ మొత్తం రూ. 332.71 కోట్లను విడుదల చేశారు. 2014 నుండి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఒక్క పైసా నిధులు కూడా ఎందుకు విడుదల చేయలేదని ఎంపీ బండి సంజయ్‌ను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 10% రిజర్వేషన్ల ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఆమోదించి వెంటనే రిజర్వేషన్లు కల్పించి, మేడారానికి జాతీయ హోదా తెచ్చి , ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ సంజయ్‌ను ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు మేడారం జాతరకు జాతీయ హోదా, గిరిజనులకు 10% రిజర్వేషన్లు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సత్యవతి రాథోడ్ రాసిన తాజా లేఖలను జతచేస్తూ ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత.

- Advertisement -