మరోసారి బయో ఏషియా సదస్సుకు వేదికైన భాగ్యనగరం..

110

బయో ఏషియా సదస్సుకు మరోసారి హైదరాబాద్ వేదికైంది.. ఈ సదస్సు ఫిబ్రవరి 24న ప్రారంభం కానుంది..రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 24,25 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సదస్సు. జరగనుంది.. కోవిడ్ నేపథ్యంలో ఈ సారి బయో ఏషియా సదస్సు వర్చువల్‌గా జరుగుతుంది. ఈ సంవత్సరం సదస్సు థీమ్ ” ఫ్యూచర్ రెడీ” పేరుతో నిర్వహించబడుతుంది. లైఫ్-సైన్సెస్ ఫోరమ్‌కు వర్చువల్‌గా 70కి పైగా దేశాల నుండి 30 వేల మంది ప్రతినిధులు హాజరవుతారు. బయో ఏషియా 2022 ఈవెంట్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వం,పరిశ్రమలు,పెట్టుబడిదారులు, విద్యాసంస్థల నుండి ప్రముఖ వక్తలు హాజరవుతారు. బయో టెక్నాలజీ,లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఫ్లాగ్ షిప్ కార్యక్రమం నిర్వహించనున్నారు.