ఇయర్ ఎండ్..కార్లపై అదిరిపోయే ఆఫర్లు!

94
hyundai

పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పే సమయం ఆసన్నమైంది. ఇక ఇయర్ ఎండ్‌లో భాగంగా ఎప్పటిలాగే కార్లపై భారీగా డిస్కౌంట్‌లను ప్రకటించేందుకు కార్ల తయారీ సంస్థలు సిద్ధం అయ్యాయి. ఇందులో భాగంగా హ్యుందాయ్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీగా డిస్కౌంట్‌లను ప్రకటించింది.

శాంట్రో, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, ఎలెంట్రా వంటి మోడళ్లపై అదిరిపోయే తగ్గింపు అందిస్తోంది. డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా మోడల్‌ని బట్టి డిస్కౌంట్‌లను ఆఫర్ చేసింది.

శాంట్రో కారుపై రూ.50 వేల వరకు క్యాష్ డిస్కౌంట్, మూడేళ్ల ఆన్‌రోడ్ వారంటీ ఇస్తుండగా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారుపై రూ.60 వేల వరకు తగ్గింపు ఉంది.ఐ10 నియోస్ కారుపై కూడా రూ.60,000 వరకు తగ్గింపు, హ్యుందాయ్ ఆరా కారుపై ఏకంగా రూ.70 వేల వరకు డిస్కౌంట్‌ను,హ్యుందాయ్ ఎలంట్రా కారుపై గరిష్టంగా రూ.లక్ష వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది.