ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్‌:కర్నె

172
Karne Prabhakar
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమం హాస్యాస్పదం అన్నారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన జాతీయ పార్టీ కి జాతీయ విధానం లేదు..రాష్ట్రానికో విధానంతో కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక విధానం- అధికారంలో లేని రాష్ట్రాల్లో ఒక విధానం అవలంబిస్తోందని మండిపడ్డారు. దేశ రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీ కాంగ్రెస్.…కాంగ్రెస్ నేర్పిన రాజకీయాన్ని ఇవ్వాళ దేశంలో బీజేపీ చేస్తోందన్నారు.

ఎన్టీఆర్ పాలన వచ్చే వరకు గవర్నర్ ను అడ్డుపెట్టుకొని రాజకీయం చేసిన కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడించడం విడ్డురంగా ఉందన్నారు. రాజస్థాన్ లో ఒక విధానం- తెలంగాణ లో ఒక విధానామా? ఏ నీతి తో రాజకీయం చేస్తున్నారు!?…తెలంగాణ లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని రాష్ట్రపతి పాలన విధించాలని అసంబద్ధ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు రాజస్థాన్ లో తమ ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తున్నారని రాజభవన్లు ముట్టడి స్తున్నారని మండిపడ్డారు.

ఇదేం నీతి ?…సెక్షన్ 8 గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యం గురించి వల్లె వేయడమా ?..కరొనా ప్రభావంతో పండుగలను సైతం ప్రజలు పక్కకు పెడితే కాంగ్రెస్ కొరొనా రూల్స్ బ్రేక్ చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చావు దగ్గర పెళ్లి మంత్రాలు వాడుతున్నారు!.…భాద్యత లేకండా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నేతలు తమకు కరోనా వస్తే భాద్యత ప్రభుత్వానిదే అంటూ అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారు…కాంగ్రెస్ తన రాజకీయ స్వార్ధం కోసం ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు.

- Advertisement -