పోతిరెడ్డిపాడు నుండి నీటి తరలింపుకు వ్యతిరేకం: కర్నె ప్రభాకర్

256
Karne Prabhakar
- Advertisement -

పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు నకు టీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకమే అన్నారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన కర్నె ప్రభాకర్…..ఆనాడు నీటి తరలింపు ను సమర్ధించిన దొంగలే ఇవ్వాళ దొంగ దొంగ అని అరుస్తున్నారని తెలిపారు.

2014 వరకు రాయలసీమ నాయకులు నీళ్లు తీసుకుపోతే అడ్డుకోని కాంగ్రెస్ నేతలు ఇవ్వాళ విమర్శలు చేస్తున్నారు.…ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ ఆధిపత్యం ఆంధ్రా ప్రాంతం నాయకులే.…ఏ అంశంలోనైనా ఆంధ్రా ప్రాంతం నాయకులదే ఆధిపత్యం ఉండేదన్నారు.

బ్రిజేష్ కుమార్ అవార్డులో కూడా అప్పటి ఆంద్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని తెలిపారు.…కృష్ణానది జలాల పై కేంద్రానికి చేసిన విజ్ఞప్తులన్ని పెండింగ్ లో ఉన్నాయి.…స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు ప్రతిపాదనను అడ్డుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు.

203-388 జివో పై మాత్రమే తెలంగాణ ప్రభుత్వం పోరాటం చేస్తుంది.…కొందరు కాంగ్రెస్ నేతలు ఏపీ ని వదిలి కర్ణాటక పై తాము పోరాడుతున్నట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు…కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలకు టీఆరెస్ ప్రభుత్వం ఇవ్వాళ కడిగే ప్రయత్నం చేస్తోంది.…తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉండగానే ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాల వినియోగం పై అక్రమంగా జీవో లు విడుదల చేసింది…ఆ జీవో లను అడ్డుకోవాలని సుప్రీం కోర్టు ను ఆశ్రయించాము…సుప్రీం కోర్టు లో మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందన్నారు.

- Advertisement -