కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: ఎమ్మెల్సీ కవిత

182
mlc kavitha
- Advertisement -

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించారు టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. గెలిపించిన ప్రజలకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు ట్వీట్ చేశారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. ఈ విజయానికి కృషి చేసిన తెరాస ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు.. ఇంతటి భారీ విజయాన్ని సమకూర్చిన ఎంపిటిసి, జడ్పిటిసి, ఎంపీపీ, కార్పొరేటర్, కౌన్సిలర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో మొత్తం 824 ఓట్లకు గాను, 823 ఓట్లు పోలవ్వగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, 728 ఓట్లు సాధించి చరిత్ర సృష్టించారు. పోతాంకర్ లక్ష్మీనారాయణ (బీజేపీ)- 56, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి( కాంగ్రెస్)-29 ఓట్లు సాధించి, డిపాజిట్ కోల్పోయారు. 10 ఓట్లను చెల్లనవిగా ప్రకటించారు ఎన్నికల సంఘం అధికారులు. మొత్తం రెండు రౌండ్లలో కౌంటింగ్ జరగ్గా..రెండు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పూర్తి ఆధిక్యం సాధించారు. మొదటి రౌండ్ లోనే గెలుపునకు కావలసిన మెజారిటీ సాధించి, విజయ ఢంకా మోగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల్లో కల్వకుంట్ల కవిత పట్ల ఉన్న ఆదరణ ఇంతటి ఘన విజయానికి ముఖ్య కారణాలుగా నిలిచాయి.

- Advertisement -