‘అక్షరయాన్’ వెబ్ సైట్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత..

38
kavitha

మహిళలపై జరుగుతున్న వేధింపులపై, అక్షరాలే ఆయుధాలుగా, తమ రచనల ద్వారా సమాజంలో మార్పునకై పాటుపడుతున్న ‘అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫోరమ్’ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. ‘తెలుగు మహిళా రచయితల ఫోరం-అక్షరయాన్’ కు చెందిన 25 మంది రచయిత్రిలు, ప్రముఖ రచయిత్రి ఐనంపూడి శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితను హైదరాబాదు లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ ‘https://aksharayan.org’ వెబ్ సైట్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. వెబ్ సైట్ రూపకర్తలను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.

“తమిరిశ జానకి కవితల పోటీ”లో గెలుపొందిన రచయిత్రిలకు ఎమ్మెల్సీ కవిత బహుమతులు అందజేశారు. అంతేకాదు పలు నూతన పుస్తకాలను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, వేణుగోపాలాచారి, పలువురు రచయిత్రులు పాల్గొన్నారు.