డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కేసీఆర్ కల: ఎమ్మెల్సీ

98
MLC Farooq Hussain

సిద్దిపేటలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. ఈ రోజు సిద్ధిపేట జిల్లా డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు సందర్భంగా ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్ కల. ఇండ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం ఉండవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఇండ్లు దక్కాలన్నది ముఖ్యమంత్రి ఆశయమని హుస్సేన్ తెలిపారు.

సిద్ధిపేటలో డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి హరీష్ రావు తన స్వంత ఇంటిలా కట్టించారు. ఇండ్ల కేటాయింపులో మంత్రి హరీష్ రావు కూడా జోక్యం చేసుకోలేదు. జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. గతంలో పార్టీలు సంక్షేమ పథకాలు తమ కార్యకర్తలకు ఇచ్చుకున్నాకే ఇతరులకు ఇచ్చే వారని.. కేసీఆర్ హయాంలో ఆపద్దతి మారిందని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పేర్కొన్నారు.