మొక్కలు నాటిన నటుడు అశోక్ కుమార్..

116
Actor Ashok kumar

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతంగా ముందుకు పోతుంది. వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరుగుతుంది. నటుడు జాకీర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రముఖ నటులు అశోక్ కుమార్ (తెనాలి రామకృష్ణ పాత్రధారులు) ఈ రోజు ఆదర్శ నగర్ లోని పార్క్ లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ.. వాతావరణం ధ్వంసమవుతున్న ఈ సందర్భంలో పచ్చదనం పెంచడం కోసం నడుం కట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమంను రాజ్యసభ సభ్యులు సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం గోప్ప విషయం అని. రోజు రోజుకు తగ్గిపోతున్న భూగర్భ జలాల వల్ల చాలా భయం కలుగుతుందని ఒక స్థాయికి దిగి భూగర్భ జలాలు తగ్గిపోతే క్లోరిన్‌తో కలిస్తే చాలా ప్రమాదం ఏర్పడుతుందని.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వల్ల ఇలాంటి ప్రమాదాన్ని నివారించవచ్చు అని తెలిపారు.

సద్గురు వారు కూడా నదుల వెంట ఒక యజ్ఞంలా మొక్కలు నాటి పచ్చదనం పెంచారు అని. అలాంటి కార్యక్రమాన్ని మరొక సారి రాజ్యసభ సభ్యులు సంతోష్ చేపట్టి ముందుకు తీసుకు పోతున్నారు అని. చెట్లు ఉంటే మానవ మనుగడ సాధ్యమని మనిషి సంఘజీవి అని చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. సినిమా ప్రముఖులు మొక్కలను నాటుతున్నారు సెల్ఫీలు దిగుతున్నారు వెళ్తున్నారని అని అనుకోకుండా మీరు కూడా మీకు వీలైనన్ని మొక్కలు నాటి కుదిరితే మాకు కూడా పంపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మధ్య కాలంలోనే హీరో ప్రభాస్ ఎంపీ సంతోష్ విజ్ఞప్తి మేరకు అడవిని దత్తత తీసుకొని దాని అభివృద్ధి చేస్తున్నారు. ఒక అడవిని దత్తత తీసుకోవాలంటే దానికి దమ్ము ఉండాలి అంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్న సంతోష్ కి ప్రభాస్ కు అభినందనలు తెలియజేశారు. ప్రజలు కూడా మీ ఇంటి ఆవరణలో ఒక్క మొక్కను అయిన నాటాలని ఒక్కొక్క మొక్క లక్ష మొక్కలు మారుతాయని ఆయన తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.

ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అశోక్‌ కమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా నేను మరొక ముగ్గురు నా మిత్రుడు చెన్నై వాసి శుభలేఖ సుధాకర్, అదే విధంగా నేను చిన్నప్పటినుండి కలిసి నటించిన మరొక మిత్రుడు నేను తెనాలి రామకృష్ణ పాత్రలో అతను శ్రీ కృష్ణదేవరాయ పాత్రలో నటించిన అశోక్ రావు, అదేవిధంగా గౌతం రాజులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గన్ ఫౌండ్రీ కార్పొరేటర్లు మమతా సంతోష్ గుప్తా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.