ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర

120
palla
- Advertisement -

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. రాష్ట్రంలో రెండు స్ధానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా సాధారణ ఎన్నికలను తలపించేలా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి ప్రధాన పార్టీలు. వరుస ర్యాలీలు, సభలు, సమావేశాలతో గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

మహబుబ్‌నగర్- హైదరబాద్ -రంగారెడ్డిలో ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థి పీవీ కూతురు వాణిదేవి,ఇండిపెండెంట్ అభ్యర్ధి నాగేశ్వర్ మధ్య పోటీ నెలకొనగా నల్గొండ- వరంగల్ -ఖమ్మం గ్రాడ్యుయెట్ నియెజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా గెలుపు నల్లేరుపై నడకే కానుంది. కేటీఆర్‌తో సహా మంత్రులంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఇక ఇవాల్టీతో ఎన్నికల ప్రచారం ముగియనుండగా ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 17న ఫలితాలు రానున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నుండి ఆదివారం సాయంత్రం వరకు మద్యం షాపులను మూసివేయనున్నారు.

- Advertisement -