అమెరికాలో కాల్పుల కలకలం..ముగ్గురు మృతి

262
texas shooting
- Advertisement -

అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. టెక్సాస్‌లోని ఓ అపార్ట్‌మెంట్ ఆవరణలో బుధ‌వారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో కాల్పులు సంభ‌వించాయని పోలీసులు తెలిపారు. ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిపి కాల్పులకు తెగబడగా ముగ్గురు మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. మృతుల్లో ఇద్ద‌రు 18 ఏండ్ల వ‌య‌సు క‌లిగిన వారు కాగా, మ‌రొక‌రిది 40 ఏండ్ల వ‌య‌సు. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -