తిరుమల శ్రీవారిసేవలో ఎమ్మెల్సీ డొక్కా..

93
- Advertisement -

తిరుమల శ్రీవారిని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆలయం వెలుపల డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుకు స్వామి శ్రీవారి అనుగ్రం మెండుగా ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు. ఒంటిమిట్ట రామాలయంలో ఆది జాంబవుని గుడి కట్టాలని టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పిన ఆయన.. గుంటూరులో అరుంధతి మాత దేవాలయ నిర్మాణానికి టీటీడీ సహకారం అందించాలని కోరుతున్నామన్నారు. ఆది జాంబవులు, మాదిగల కోరిక అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో చాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.సంక్షేమ ఫలాలు సామాన్య ప్రజలకు అందకూడదని ప్రతిపక్షం వ్యూహాలు పన్నుతోందని విమర్శించారు. జగన్ సంకల్పం, శ్రీవారి ఆశీస్సులతో సంక్షేమ కార్యక్రమాలు ఆగవని స్పష్టం చేసారు.ప్రతిపక్షాలు విమర్శలతో కాలక్షేపం చేయకుండా… అభివృద్ధికి సహకరించాలని కోరారు. గృహ నిర్మాణం పథకంపై ప్రతిపక్ష టీడీపీ పార్టీ చేస్తున్న ఆరోపణలు తగదని ఆక్షేపించారు.

- Advertisement -