బిగ్‌బాస్‌ 5 : కాజల్‌ ఎలిమినేట్‌!

57

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. ఇంకో వారమే మిగిలి ఉన్నాయి. అటు బిగ్‌బాస్ హౌస్‌లోనూ ఈ టైటిల్ కోసం పోటీ పడుతోన్న కంటెస్టెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ వారం మరొకరు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే 13 మంది ఎలిమినేట్ అయ్యారు. 14వ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తేలిపోయింది.

ఈ పద్నాలుగో వారం మానస్‌, సిరి, షణ్ను, కాజల్‌, సన్నీ.. ఐదుగురూ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో షణ్ను, సన్నీ సేవ్‌ అవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షణ్ను కూడా ఎలిమినేట్‌ అ‍య్యే అవకాశాలున్నాయన్నారు కానీ అదంతా ఫేక్‌! షణ్ను, సన్నీలకు భారీ ఎత్తున ఓట్లు నమోదవుతున్నాయని సమాచారం.. మానస్‌కు కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. ఇక సిరి, కాజల్‌లో ఒకరు ఎలిమినేట్‌ అవుతారని మొదటి నుంచీ అంతా అనుకుంటూ వస్తున్నారు.

తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ఎవరు ఎలిమినేట్‌ అయ్యారన్న విషయం లీకైంది. కాజల్‌ ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే టాప్‌ 5లో అడుగుపెట్టాలన్న ఆమె ఆశలు అడియాసలైనట్లు కనిపిస్తోంది. దోస్తులతో పాటు తాను కూడా ఫినాలేలో అడుగుపెట్టాలన్న కల నెరవేరకుండానే బిగ్‌బాస్‌ షో నుంచి నిష్క్రమించనుంది కాజల్‌. దీంతో ఆమె అభిమానులు ఈ ఎలిమినేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిని కాపాడటానికే కాజల్‌ను పంపించివేస్తున్నారంటూ షోను దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇక ఇప్పటికే.. సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు. ఆరోగ్య కారణాలతో జెస్సీ అలియాస్ జస్వంత్ పడాల బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తరువాత యానీ మాస్టర్ ఎలిమినేషన్‌ను ఎదుర్కొన్నారు. ఎవరూ ఊహించని విధంగా టఫ్ కాంపిటీటర్‌గా భావించిన యాంకర్ రవి సైతం హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తరువాత- ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ.. ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ హౌస్‌ను వీడారు.