వెనుకబడిన వర్గాల మద్దతు టీఆర్ఎస్‌కే: ఎమ్మెల్సీ సారయ్య

20
saraiah

వెనుకబడిన వర్గాల మద్దతు టీఆర్ఎస్‌కే ఉంటుందని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సారయ్య…సామాజిక న్యాయాన్ని ఈ ఎన్నికల్లో పాటించిన ఏకైక పార్టీ టీ ఆర్ ఎస్ అన్నారు. అత్యంత వెనకబడిన వర్గాలను గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదు…ఎంబీసీ లకు ghmc సీట్లలో న్యాయం చేసిన సీఎం కెసిఆర్ కు రుణ పడి ఉంటాం అని తెలిపారు.

బండి సంజయ్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. బండి సంజయ్ సవాల్ విసరాలని అనుకుంటే చార్మినార్ టెంపులే దొరికిందా.. వేరే గుడులు లేవా అని ప్రశ్నించారు.దొంగే దొంగే అన్నట్లు వరద సహాయం ఇవ్వకుండా ప్రజల పొట్ట కొట్టారు..పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి ..అసత్య ప్రచారాలు బీజేపీ మానుకోవాలన్నారు.

ఎంపీ గా ఉండి బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారూ..కేసీఆర్ ని పీఎం మోడీ ఏ మెచ్చుకున్నారు..Ghmc ఎన్నికల్లో ప్రజలు బీజేపీ కి బుద్ధి చెబుతారని చెప్పారు.